Header Banner

ఎవర్ని పడితే వాళ్లను సాకడానికి భారత్ ధర్మసత్రం అనుకుంటున్నారా? సుప్రీంకోర్టు ఫైర్!

  Mon May 19, 2025 18:09        India

శరణార్థులకు ఆశ్రయాన్ని కల్పించే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. భారత్.. ధర్మసత్రం కాదని తేల్చి చెప్పింది. ఇప్పటికే 140 కోట్ల మంది జనాభాతో దేశం స్ట్రగుల్ అవుతోందని పేర్కొంది. అలాంటి పరిస్థితుల్లో రెఫ్యూజీల విషయంలో జోక్యం చేసుకోవడం సరికాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.


శ్రీలంకకు చెందిన తమిళ శరణార్థిని ఇంకా కొంతకాలం పాటు నిర్బంధంలో ఉంచుకోవడానికి అనుమతి కోరుతూ దాఖలైన పిటీషన్ పై న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ వినోద్ చంద్రన్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదోపవాదాల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.


 

ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన శరణార్థులకు భారత్ ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటున్నారా?, 140 కోట్ల మంది జనాభాతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నాం, ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన విదేశీయులకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి భారత్.. ధర్మసత్రం కాదు.. అని బెంచ్ తేల్చి చెప్పింది. శ్రీలంకకు చెందిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలంతో సంబంధం ఉన్నాడనే అనుమానంతో ఆ దేశీయుడిని 2015లో పోలీసులు అరెస్టు చేశారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి మరోసారి దెబ్బ మీద దెబ్బ! ఒకే రోజు రెండు వరుస షాకులు!

 

 

చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA)లోని సెక్షన్ 10 కింద అతన్ని కింది కోర్టు 2018లో దోషిగా నిర్ధారించింది. 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2022లో మద్రాస్ హైకోర్టు అతని శిక్షా కాలాన్ని ఏడు సంవత్సరాలకు తగ్గించింది. శిక్షా కాలం ముగిసిన వెంటనే అతను భారత్ విడిచి వెళ్లాలని, అప్పటి వరకు శరణార్థి శిబిరంలోనే ఉండాలని ఆదేశించింది. దీనిపై అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. వాల్యుడ్ విసాపై భారత్ కు వచ్చానని, శ్రీలంకలో తన ప్రాణాలకు ముప్పు ఉందని పిటీషన్ దాఖలు చేశాడు.


దాదాపు మూడు సంవత్సరాలుగా తాను నిర్బంధంలోనే ఉన్నానని, బహిష్కరణ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని పిటిషనర్ తరపు న్యాయవాది.. బెంచ్ కు వివరించారు. భార్య, కుమారుడి ఆరోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని, మానవతా దృక్పథంతో భారత్ లోనే స్థిరపడ్డారని న్యాయవాది తెలిపారు. అన్నారు. దీనిపై బెంచ్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. భారత్ లో స్థిరపడటానికి ఏ హక్కు ఉందని ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం భారత్ లో స్థిరపడే ప్రాథమిక హక్కు దేశ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని జస్టిస్ దీపాంకర్ దత్తా గుర్తు చేశారు.


ఇది కూడా చదవండి: ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చ! ఆ మూడు డిమాండ్లపై..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #SupremeCourt #IndiaImmigration #SCRemarks #IllegalImmigrants #NationalSecurity